Samantha Item Song: పుష్ప కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సమంత

Samantha: ఒక్క పాటకి కోటి రూపాయలు అంటున్న సమంత

admin1
Published on: 15 Dec 2021 3:04 PM IST
Shocking Remuneration For Samanthas Item Song in Allu Arjun Pushpa Movie | Samantha News
X

 ఒక్క పాటకి కోటి రూపాయలు అంటున్న సమంత (ఫైల్ ఫోటో)

Samantha Item Song Remuneration: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "పుష్ప" సినిమాలో సమంత ఒక ఐటెం సాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా లోని 5వ పాట గా "ఊ అంటవా ఊ ఊ అంటావా" అనే టైటిల్ తో త్వరలో ఈ పాట విడుదల కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం కేవలం ఈ ఒక్క పాటలో డాన్స్ చేసినందుకు సమంత ఏకంగా 1.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక స్టార్ హీరోయిన్ కాబట్టి ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడుతుంది అని నిర్మాతలు కూడా ఆమెకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనసూయ, సునీల్ మరియు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమాని విడుదల కాబోతోంది. ఇక అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన "సన్నాఫ్ సత్యమూర్తి" సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది తర్వాత బన్నీతో ఓకే ఫ్రేమ్ లో కనిపించనుంది.

admin1

admin1

Next Story