Dootha Web Series: నాగచైతన్య "దూత" లో షాకింగ్ పాయింట్...

Dootha Web Series: ఇది ఒక హారర్ వెబ్ సిరీస్ అని అందరికీ తెలిసిన విషయమే...

Shireesha
Published on: 4 May 2022 3:09 PM IST
Shocking Points in Naga Chaitanya Web Series Dootha | Tollywood Gossips
X

Dootha Web Series: నాగచైతన్య "దూత" లో షాకింగ్ పాయింట్...

Dootha Web Series: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో "దూత" అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా అడుగు పెట్టబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఒక హారర్ వెబ్ సిరీస్ అని అందరికీ తెలిసిన విషయమే.

అయితే ఈ వెబ్ సిరీస్ కథ ఎలా ఉండబోతోంది అందులో నాగచైతన్య పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో విక్రమ్ మాధవన్ హీరోగా "13 బి" అనే ఒక హారర్ సినిమా తీశారు. టీవీ సీరియల్ పాత్రలతో సైతం భయాన్ని సృష్టించి ప్రేక్షకులను కట్టిపడేసారు విక్రమ్. అయితే "దూత" వెబ్ సిరీస్ లో కూడా విక్రమ్ అలాంటి ఒక షాకింగ్ ఎలిమెంట్ పెట్టబోతున్నారట.

నిర్జీవంగా ఉండే వస్తువులు కూడా తప్పు చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి. చట్టంలో వీటికి శిక్ష ఉండదు, పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. కానీ అలాంటి సమయంలో నాగచైతన్య కుటుంబాన్ని ఒక ప్రమాదం చుట్టుముడుతుంది. మరి వారిని కాపాడే "దూత" ఎవరు? కంటికి కనిపించని దెయ్యాల నుంచి నాగచైతన్య తన ఫ్యామిలీ ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ వెబ్ సిరీస్ సారాంశం అని కొందరు చెబుతున్నారు.

Shireesha

Shireesha

Next Story