సమంత గురించి తెలియని షాకింగ్ నిజాలు

Ruthvik
Published on: 29 April 2019 12:52 PM IST
సమంత గురించి తెలియని షాకింగ్ నిజాలు
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. కానీ అసలు సమంత గురించి ఇప్పటికీ అభిమానులకు తెలియని కొన్ని నిజాలున్నాయి అంటే మీరు నమ్మగలరా? అవేంటో చూద్దాం రండి. సమంత నటించిన తొలి సినిమా 'ఏమాయ చేశావే' కాదు. సమంత అంతకుముందే ఎం.ఆర్.రవివర్మన్ దర్శకత్వం వహించిన 'మాస్కో ఇన్ కావేరి' అనే చిత్రంలో నటించింది. అదే తన తొలి సినిమా. హీరోయిన్ కాకముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది సామ్. ప్రస్తుతం ఒక సినిమాకి 2 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకునే సామ్ ఒకప్పుడు తనకు 20 వయసులో రకరకాల పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేది.

సమంత రూత్ ప్రభు తన పూర్తి పేరు అని అనుకుంటాం కానీ తనని యశోద అని ఇంట్లోవాళ్ళు, కొందరు స్నేహితులు పిలుస్తారట. సమంతకు ప్రముఖ హాలీవుడ్ నటి ఆడ్రూ హెప్ బర్న్ స్ఫూర్తి. సమంత ఇష్టంగా తినే ఫుడ్ 'సుషి' అనే జపనీస్ డిష్. సమంత ఒక సుగర్ పేషెంట్. 2013లోనే తనకు సుగర్ ఉందని డాక్టర్లు నిర్థారించారు. ఇక ప్రత్యూష ఎన్జీవో సంస్థను స్థాపించిన సమంత పేద విద్యార్థులు, మరియు మహిళలకు ఎంతో సాయపడుతోంది. ప్రత్యూష గురించి తెలియని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. సామ్ గురించి ఇన్ని మనకి తెలియని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయన్నమాట.

Ruthvik

Ruthvik

Next Story