Bigg Boss 7 Elimination: లేడీస్‌పై పగబట్టిన బిగ్‌బాస్.. ఈవారం ఎలిమినేషన్ లిస్టులో బిగ్ ట్విస్ట్..!

Bigg Boss 8th Week Elimination: 'బిగ్‌బాస్ 7' సీజన్ రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది.

Arun Chilukuri
Updated on: 28 Oct 2023 1:00 PM IST
Shobha Shetty or Aata Sandeep may Elimination 8th Week of Bigg Boss 7 Telugu Season
X

Bigg Boss 7 Elimination: లేడీస్‌పై పగబట్టిన బిగ్‌బాస్.. ఈవారం ఎలిమినేషన్ లిస్టులో బిగ్ ట్విస్ట్..!

Bigg Boss 8th Week Elimination: 'బిగ్‌బాస్ 7' సీజన్ రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది. గత రెండు వారాలుగా అందర్నీ ఆకట్టుకోవడంలో యాజమాన్యం విజయవంతమైంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. సగం రోజులు కూడా పూర్తయ్యాయి. ఇక ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లు ట్రోఫీ అందుకునేందుకు తమ ప్రయత్నాలకు మరింత పదును పెట్టారు. ఈ క్రమంలో ఎలాంటి గొడవకైనా సిద్ధమవుతున్నారు. ఈ వారం 8మంది నామినేట్ అయ్యారు. కాగా, ఈ వారం కూడా ఓ లేడీ కంటెస్టెంట్ ఇంటిని వీడనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏడుగురు లేడీస్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో నెటిజన్లు మాత్రం తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు బిగ్ బాస్ ఈ లేడీస్ అంటే అంతకోపం.. వాళ్లనే టార్గెట్ చేసి, ఇంటికి పంపిస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్‌ ఇంట్లో రెండు గ్రూపులు..

బిగ్‌బాస్ షో నిర్వహకుల ప్రకారం ఎవరి గేమ్ వాళ్లే ఆడాల్సి ఉంటుంది. కానీ, ఇంట్లో మాత్రం 2 గ్రూపులు కట్టేశారు. సీరియల్ గ్రూప్‌లో మా టీవీలో నటించే వారంతా చేరారు. ఈ బ్యాచ్ వాళ్లతో ప్రతిరోజూ ఇబ్బందులే వస్తున్నాయి. ఎలిమినేషన్స్‌లో ఉన్న యావర్, ప్రశాంత్, భోలెకి అండగా శివాజీ నిలిచాడు. మరోవైపు అమరదీప్, శోభా, ప్రియాంక, సందీప్ మరో గ్రూపుగా ఏర్పడ్డారు. ఇక ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న వాళ్లపై ఆసక్తి పెరిగింది.

కాగా, ఈ వారం శివాజీ, భోలె, అమరదీప్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్‌ను వీడుతారోననే ఆసక్తి పెరుగుతోంది. అయితే, ఓటింగ్ ప్రకారం శివాజీకి అధిక ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఓటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన శివాజీ ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నాడు. ఇక భోలె శావలీ రెండో స్థానంలో నిలిచాడంట. అమరదీప్, అశ్విని, గౌతమ్, ప్రియాంక తర్వాతి స్థానాల్లో నిలిచారు. సందీప్, శోభాశెట్టి చివరి స్థానాల్లో నిలిచారు. దీంతో ఈ ఇద్దరిలో శోభాశెట్టి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పుకుంటుందని అంటున్నారు. ఒకవేళ లేడీ అని బిగ్ బాస్ కాంప్రమైజ్ అయితే, సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. కాగా, వీరిలో ఎవరు ఇంటి నుంచి వెళ్లినా సెన్సెషనే అవుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story