Bigg Boss 7 Telugu Voting: డేంజర్‌ జోన్‌లో ఇద్దరు.. లీస్ట్ ఓటింగ్‌తో ఎలిమినేషన్.. ఎవరంటే..?

Bigg Boss 7 Telugu Voting: బిగ్‌ బాస్‌ తెలుగు రియాల్టీ షో 9వ వారంలోకి అడుగుపెట్టింది. 9వ వారం నామినేషన్స్‌‌ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్‌లో భాగంగా డ్రాగన్‌ స్నేక్‌ టాస్క్‌ ఇచ్చారు.

Shekhar G
Updated on: 2 Nov 2023 5:01 PM IST
Shobha Shetty And Priyanka Jain In Danger In Bigg Boss 7 Telugu
X

Bigg Boss 7 Telugu Voting: డేంజర్‌ జోన్‌లో ఇద్దరు.. లీస్ట్ ఓటింగ్‌తో ఎలిమినేషన్.. ఎవరంటే..?

Bigg Boss 7 Telugu Voting: బిగ్‌ బాస్‌ తెలుగు రియాల్టీ షో 9వ వారంలోకి అడుగుపెట్టింది. 9వ వారం నామినేషన్స్‌‌ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్‌లో భాగంగా డ్రాగన్‌ స్నేక్‌ టాస్క్‌ ఇచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క కంటెస్టెంట్‌‌కు ఇద్దరు పేర్లను నామినేట్‌ చేయమంటూ బిగ్ బాస్ సూచించారు. ఇలా ఈ వారం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. ప్రియాంక జైన్, ప్రిన్స్‌ యావర్‌, శోభా శెట్టి, టేస్టీ తేజా, రతికా రోజ్‌, అమర్ దీప్‌, అంబటి అర్జున్‌, భోలే షా వళి ఇలా మొత్తం 8మంది నామినేషన్స్‌లో ఉన్నారు.

ఇక 9వ వారం ఓటింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఓటింగ్‌లో ప్రిన్స్‌ యావర్‌ దూసుకపోతున్నాడు. అగ్రస్థానంలో నిలిచాడు. 20 శాతం ఓట్లతో మిగతా వారి కంటే ముందున్నాడు. పాట బిడ్డ భోలే షా వళి 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

అమర్‌ దీప్‌ చౌదరి 13 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. రతికా రోజ్‌ 10.9 శాతం ఓట్లతో 4వ స్థానంలో నిలిచాడు. అంబటి అర్జున్‌ 10.6 శాతం ఓట్లతో 5వ స్థానంలో నిలవగా , టేస్టీ తేజా 10.27 శాతం ఓటింగ్‌ తో 6వ స్థానంలో నిలిచారు. ప్రియాంక జైన్‌, శోభా శెట్టి ఓటింగ్‌లో చివరి స్థానంలో నిలిచారు. ప్రియాంక జైన్‌ 7 శాతం ఓట్లతో, శోభా శెట్టి 4 శాతం ఓట్లతో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరూ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. శుక్రవారం వరకు ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. లేదంటే ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Shekhar G

Shekhar G

Next Story