బ్రహ్మానందం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన శివ కార్తికేయన్

Siva Karthikeyan: వరుణ్ డాక్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పేరు తెచ్చుకున్న తమిళ్ హీరో శివ కార్తికేయన్ ...

Sriveni Erugu
Updated on: 19 May 2022 8:45 PM IST
Shiva Karthikeyan made interesting comments about Brahmanandam
X

బ్రహ్మానందం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన శివ కార్తికేయన్

Siva Karthikeyan: వరుణ్ డాక్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పేరు తెచ్చుకున్న తమిళ్ హీరో శివ కార్తికేయన్ తాజాగా ఇప్పుడు "డాన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రొమాంటిక్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి శిబిచక్రవర్తి దర్శకత్వం వహించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ ఈ సినిమాలో సముద్రఖని, ఎస్.జె.సూర్య, సూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మే 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ శివకార్తికేయన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరో అయినప్పటికీ తన సినిమాలలో కామెడీకి పెద్దపీట వేస్తూ ఉంటారు శివకార్తికేయన్. ఈ నేపథ్యంలో కామెడీ కి తనకి ఇన్స్పిరేషన్ ఎవరు అని అడగగా శివ కార్తికేయన్ వెంటనే బ్రహ్మానందం అని చెప్పటం అందరి దృష్టిని ఆకర్షించింది. "నేను బ్రహ్మానందం గారికి చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. నాకు భాష రాకపోయినప్పటికీ ఆయన రియాక్షన్స్ ఫాలో అవుతూ ఉంటాను" అని చెప్పుకొచ్చాడు శివకార్తికేయన్.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story