Shiva Karthikeyan: భూమిని కాపాడే ఏలియన్.. శివ కార్తికేయన్ ‘అయాలాన్’ మూవీ ట్రైలర్ వచ్చింది.

Shiva Karthikeyan: అయాలాన్ ట్రైలర్ వచ్చింది. యూట్యూబ్ నీ ఊపేస్తోంది. ఈ తమిళ సినిమాకి విచిత్రంగా తెలుగు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది.

Shekhar G
Published on: 6 Jan 2024 12:24 PM IST
Shiva Karthikeyan Ayalaana Trailer Out
X

Shiva Karthikeyan: భూమిని కాపాడే ఏలియన్.. శివ కార్తికేయన్ ‘అయాలాన్’ మూవీ ట్రైలర్ వచ్చింది.

Shiva Karthikeyan: అయాలాన్ ట్రైలర్ వచ్చింది. యూట్యూబ్ నీ ఊపేస్తోంది. ఈ తమిళ సినిమాకి విచిత్రంగా తెలుగు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. అంతగా సింగిల్ ప్రోమోతో వైబ్రేషన్స్ షురూ చేసింది ఫిల్మ్ టీం.

టాలీవుడ్ కి నాని ఎలానో , కోలీవుడ్ కి కార్తి, శివకార్తికేయన్ అలా అంటారు. అలాంటి నటుడు కాబట్టే తెలుగు మార్కెట్ ని కూడా మెల్లిగా సొంతం చేసుకుంటున్నాడు. మొన్న మహావీరుడిగా షాక్ ఇచ్చాడు. ఇక్కడి హీరోలకు సమానంగా సందడి చేశాడు.

ఇక ఆమధ్య జాతిరత్నాలు ఫేం అనుదీప్ మేకింగ్ లో ప్రిన్స్ మూవీ చేశాడు. అలా బైలింగువల్ ప్రయోగంతో కూడా తెలుగు, తమిళ్ మార్కెట్ లోదూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నిదానంగా తన మార్కెట్ తమిళ్ లోనే కాదు, తెలుగులో కూడా పెరుగుతోందనటానికి, ఫ్రీక్వెంట్ గా వస్తున్న సినమాలే నిదర్శనం.

నిజానికి శివకార్తికేయన్ కి తెలుగులో గుర్తింపు తెచ్చిన మూవీ రెమో, అది ఇక్కడ హిట్ అవటం, తర్వాత సీమరాజ కూడా ఇక్కడ బానే ఆడటం తో మొత్తంగా ఫోకస్ అయ్యాడు. డాన్ లాంటి హిట్ తో తెలుగు యూత్ కి కూడా కనెక్ట్ అయ్యాడు. మెల్లిగా ఇక్కడి మార్కెట్ ని కబ్జా చేయటం లో సక్సెస్ అయ్యాడు.

శివకార్తికేయన్ కెరీర్ ని వందకోట్ల రేంజ్ కి తీసుకెళ్లింది డాక్టర్ మూవీ. నెల్సన్ దిలీప్ తీసిన ఈ మూవీ అక్కడే కాదు, ఇక్కడ తెలుగు మార్కెట్ లో కూడా దుమ్ముదులిపింది. అందుకే తన అయాలాన్ మూవీ వస్తోందంటే, కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హైప్ క్రియేట్ అవుతోంది.


Shekhar G

Shekhar G

Next Story