ఫీజుల దోపిడిని అడ్డుకొండి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శివబాలాజీ

ఫీజుల దోపిడిని అడ్డుకొండి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శివబాలాజీ
x
Highlights

Shiva Balaji Fire : ఆన్లైన్ పరీక్షలతో కార్పోరేట్ స్కూల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని అంటూ సినీ నటుడు శివబాలాజీ అన్నారు.ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివబాలాజీ మాట్లాడారు.

Shiva Balaji Fire : ఆన్లైన్ పరీక్షలతో కార్పోరేట్ స్కూల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని అంటూ సినీ నటుడు శివబాలాజీ అన్నారు.ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివబాలాజీ మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఫీజులతో ఒత్తిడి చేస్తున్నాయని, ఇది సరైనది కాదని శివబాలాజీ పేర్కొన్నారు. ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ ఐడిలను బ్లాక్ చేస్తున్నారని, వ్యక్తిగతంగా ఈ మెయిల్స్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అయన వాపోయారు.

ఈ దోపిడిని ప్రభుత్వం అడ్డుకోవాలని శివబాలాజీ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క పేరెంట్‌ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఈ పోరాటానికి తనకి సపోర్టు చేయాలని శివబాలాజీ కోరారు. అటు తాము ఇప్పటికే 35% ఫీజు చెల్లించినప్పటికీ తమ పిల్లలను పరీక్ష రాయనివ్వడం లేదని శివ బాలాజీ భార్య మధుమిత అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని మధుమిత అన్నారు.

ఇక శివబాలాజీ హీరోగా అందరికి సూపరిచితుడే.. మొదట్లో తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ వచ్చిన శివబాలాజీ ఆ తరవాత ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత దోస్త్, ఆర్య, సంక్రాంతి, చందమామ, కాటమరాయుడు మొదలగు సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక తెలుగులో బిగ్ బాస్ వన్ సీజన్ లో పాల్గొని విజేత గా నిలిచాడు.. ఇక 2009లో శివ బాలాజీ తన సహనటి అయిన మధుమితని పెళ్లి చేసుకున్నారు.. వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories