"డై హార్డ్ ఫ్యాన్" గా పరిచయం కాబోతున్న శివ ఆలపాటి

Shiva Alapati to be Introduced as Die Hard Fan
x

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న "డై హార్డ్ ఫ్యాన్"

Highlights

Die Hard Fan: సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న "డై హార్డ్ ఫ్యాన్"

Die Hard Fan: శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా అభిరామ్ ఎమ్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "డై హార్డ్ ఫ్యాన్". శ్రీ హన్ సినీ క్రియేషన్స్ పతాకం ఈ సినిమాను నిర్మిస్తుంది. ఒక సెలబ్రిటీ కి మరియు అభిమాని కి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తన ఇంటెన్స్ లుక్కుతో శివ ఆలపాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. షకలక శంకర్, రాజీవ్ కనకాల, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ పోస్టర్ కు మంచి ఆదరణ లభించిందని దానికి చాలా సంతోషంగా ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది.

కామెడీ తో పాటు ఈ సినిమాలో థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని ఇప్పటికే చాలా వరకు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్లు వచ్చాయి కానీ వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుందని కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను కచ్చితంగా ఈ సినిమా అలరిస్తుందని చెబుతోంది ఈ చిత్ర బృందం. ఇక డైరెక్టర్ అభిరామ్ కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారని ఏ విషయంలోనూ నిర్మాత రాజీపడకుండా మంచి బడ్జెట్ తో నిర్మించినట్లు తెలిపారు. మధు పొన్నస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సయ్యద్ తేజుద్దిన్ డైలాగులను అందించారు. జగదీష్ బొమ్మిసెట్టీ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories