SSMB28: మహేష్ మూవీలో సీనియర్ నటి?

SSMB28: త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 13 May 2021 10:16 PM IST
Shilpa Shetty To Act In A Important Role In SSMB28
X

మహేశ్ బాబు (ఫొటో ట్విట్టర్)

SSMB28: త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'ఎస్ఎస్ఎమ్‌బీ28' వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ లో నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి.. సాగర కన్య శిల్పా శెట్టి కీలక పాత్రలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ ఆమెతో చర్చించారని, శిల్పా ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది.

కాగా, త్రివిక్రమ్ గత సినిమాలను ఓ సారి పరిశీలిస్తే.. అందులో కీలకమైన ఓ లేడీ పాత్ర కనిపిస్తోంది. 'అత్తారింటికి దారేది'లో నదియా, 'అజ్ఞాతవాసి'లో ఖుష్బు, రీసెంట్‌ సినిమా 'అల వైకుంఠపురములో'లో టబు ఇలా ప్రతీ సినిమాలో కనిపిస్తుంటారు. మహేశ్ మూవీలో శిల్పా శెట్టిని తీసుకోనున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Venkata Chari

Venkata Chari

Next Story