Shilpa Shetty: మా ఆయన అ"మాయకుడు"

Sandeep Reddy
Published on: 26 July 2021 11:24 AM IST
Shilpa Shetty Said That My Husband is Innocent And That what He Makes Only Erotic Films
X

శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా (ఫైల్ ఫోటో)

Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా రాజ్ కుంద్రాకి సంబంధించిన అంధేరీ ఆఫీస్ లో ముంబై క్రైమ్ పోలీసుల సోదాల్లో ఒక రహస్య కబోర్డులో విదేశీ కంపెనీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు పలు వీడియో టేపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో రాజ్ కుంద్రాకి శిల్పాశెట్టికి ఎలాంటి సంబంధం లేదని ప్రాధమికంగా నిర్ధారించుకున్న ముంబై పోలీసులు ఆమెకి క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క తన భర్త పోర్నోగ్రఫీ కేసులో పలు ఆధారాలతో దొరికిన తర్వాత కూడా శిల్పాశెట్టి తన భర్త కేవలం ఎరోటిక్ సినిమాలు మాత్రమే చేశాడని, పోర్న్ మూవీస్ కి ఆ కంటెంట్ కి ఎలాంటి సంబంధం లేదని రాజ్ కుంద్రాని వెనుకేసుకొచ్చింది.

దాదాపుగా 120 అశ్లీల సినిమాల నిర్మాణానికి సుమారుగా 9 కోట్ల రూపాయలను రాజ్ కుంద్రా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇక పలు రకాల ఆరోపణల నేపధ్యంలో రాజ్ కుంద్రాకి సంబంధించిన వియన్ ఇండస్ట్రీలోని తన డైరెక్టర్ పదవికి గత ఏడాదే శిల్ప శెట్టి రాజీనామా చేయడంతో పోలీసులు శిల్పాశెట్టి ఆ సమయంలో రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా తెలుసుకోనున్నారు. ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాని మరిన్ని రోజుల పాటు అదుపులో ఉంచుకోబోతున్నట్లు తెలుస్తుంది. విదేశీ కంపెనీలతో మనీ లాండరింగ్ కేసులో త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్ రాజ్ కుంద్రాని విచారించనుంది. ఇంత జరిగిన శిల్పాశెట్టి మాత్రం తన భర్త అమాయకుడని చెప్పడం పలువురిని విస్తుపోయేలా చేస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story