Pornography Case: రాజ్‌కుంద్రాపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు

Pornography Case: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ ఎపిసోడ్ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

Arun Chilukuri
Published on: 29 July 2021 8:33 PM IST
Sherlyn Chopra was summoned by Mumbai Crime Branch in Pornography Case
X

Pornography Case: రాజ్‌కుంద్రాపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు

Pornography Case: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ ఎపిసోడ్ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కుంద్రా బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా కుంద్రాపై నటి షెర్లిన్ చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. గతంలో రాజ్‌కుంద్రా తన ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో శిల్పాశెట్టితో సరైన సంబంధాలు లేవని చెప్పినట్లు స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆరోజు కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడి నుంచి తప్పించుకొని పారిపోయినట్లు షెర్లిన్ చెబుతోంది. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాజ్‌కుంద్రాపై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు కూడా చేసింది. తాజా ఆరోపణలతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story