శశిరేఖ ప్రోమో అదరగొట్టింది… చిరు–నయన్ ట్రెడిషనల్ లుక్స్

శశిరేఖ ప్రోమో అదరగొట్టింది… చిరు–నయన్ ట్రెడిషనల్ లుక్స్
x

శశిరేఖ ప్రోమో అదరగొట్టింది… చిరు–నయన్ ట్రెడిషనల్ లుక్స్ 

Highlights

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా, సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఇప్పటికే చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ భారీ హిట్ అయ్యి 76 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ రెస్పాన్స్‌తో మేకర్స్ ఉత్సాహంతో రెండో సింగిల్ ‘శశిరేఖా’ విడుదలకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 8న సాంగ్ రిలీజ్ కాబోతుండగా, తాజాగా విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

ప్రోమోలో చిరు పడవపై కనిపించగా… మరో పడవపై నయనతార ఎంట్రీ ఇస్తుంది. అందమైన లోకేషన్‌లో ట్రెడిషనల్ లుక్‌లో ఇద్దరూ కనిపించడం విజువల్స్‌కు హైలైట్‌గా నిలిచింది. చెట్ల నడుమ, పడవల మధ్య మేజిక్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ కేరళలో షూట్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సాంగ్‌ను అనంత శ్రీరామ్ రాసారు. మధుప్రియతో కలిసి భీమ్స్ సిసిరోలియోనే ఈ పాటను ఆలపించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ‘శశిరేఖ’ ప్రోమోపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్తి పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇంకో రెండు రోజుల్లో పూర్తి సాంగ్ విడుదల కానుండడంతో… ఈ మెలోడీ ఎలాంటి మేజిక్ చేస్తుందో, ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

Show Full Article
Print Article
Next Story
More Stories