Oke Oka Jeevitham: భారీ మొత్తానికి అమ్ముడైన శర్వానంద్ సినిమా..

Sharwanand’s Oke Oka Jeevitham Digital Rights Sold At Huge Price
x

Oke Oka Jeevitham: భారీ మొత్తానికి అమ్ముడైన శర్వానంద్ సినిమా..

Highlights

Sharwanand: గత కొంతకాలంగా యువ హీరో శర్వానంద్ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే.

Sharwanand: గత కొంతకాలంగా యువ హీరో శర్వానంద్ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ హీరోగా నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు", "మహాసముద్రం", "శ్రీకారం", వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. కానీ తాజాగా శర్వానంద్ హీరోగా విడుదలైన సై ఫై థ్రిల్లర్ "ఒకే ఒక జీవితం" బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

శ్రీ కార్తిక్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. సినిమా తెలుగు మరియు తమిళ్ భాషల్లో సినిమా విడుదలైంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలలో విడుదలకు సిద్ధమవుతోంది.

థియేటర్లలో మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సోనీ లివ్ లో విడుదల కి సిద్ధమవుతోంది. అక్టోబర్ రెండవ వారం నుంచి "ఒకే ఒక జీవితం" సినిమా సోనీ లివ్ లో స్ట్రీమ్ కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం సోనీ లివ్ వారు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఏకంగా 15 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో శర్వానంద్ కెరియర్ లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా "ఒకే ఒక జీవితం" అని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories