Nari Nari Naduma Murari: 'నారీ నారీ నడుమ మురారి' మిస్ చేసుకున్న స్టార్ హీరో ఇతనే.. చేసుంటే ఖాతాలో మరో హిట్ పడేదే!

Nari Nari Naduma Murari: నారీ నారీ నడుమ మురారి మిస్ చేసుకున్న స్టార్ హీరో ఇతనే.. చేసుంటే ఖాతాలో మరో హిట్ పడేదే!
x
Highlights

Nari Nari Naduma Murari: సంక్రాంతి విజేతగా నిలిచిన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'. అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ ఆసక్తికర వివరాలు ఇక్కడ చదవండి.

Nari Nari Naduma Murari: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ఎట్టకేలకు ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఆయన లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, రోజురోజుకీ కలెక్షన్లను పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

గతంలో ‘సామజవరగమన’ వంటి క్లీన్ కామెడీ హిట్‌ను అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు, ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. శర్వానంద్ కామెడీ టైమింగ్, సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్యల గ్లామర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వెన్నెల కిశోర్, వీకే నరేష్, గెటప్ శ్రీను వంటి సీనియర్ నటుల కామెడీ పండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

అయితే, ఈ సినిమా సక్సెస్ వెనుక ఒక ఆసక్తికరమైన ఇన్ సైడ్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈ కథను రామ్ అబ్బరాజు మొదట అక్కినేని వారసుడు నాగచైతన్యకు వినిపించారట. కానీ అప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల చైతూ ఈ సినిమాను చేయలేకపోయారని సమాచారం. ఆ తర్వాత ఈ కథ శర్వానంద్ వద్దకు రావడం, ఆయన ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి.

‘మహానుభావుడు’ తర్వాత ఆ స్థాయిలో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు ‘నారీ నారీ నడుమ మురారి’ ఒక ఊపిరి పోసింది. సంక్రాంతి పండుగ సీజన్‌ను ఈ సినిమా పక్కాగా క్యాష్ చేసుకుంది. ఒకవేళ చైతూ ఈ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్‌లో కూడా మరో మెమరబుల్ హిట్ పడేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories