Sharwanand: పవర్ ఫుల్ పోలీస్‌గా శర్వానంద్?

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల వచ్చిన 'శ్రీకారం' సినిమాతో మెప్పించలేకపోయాడు.

Venkata Chari
Published on: 15 April 2021 8:35 PM IST
Sharwanand to test luck as a cop!
X
శర్వానంద్ (ఫొటో ట్విట్టర్)

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల వచ్చిన 'శ్రీకారం' సినిమాతో మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం ద్విభాషా చిత్రం 'మహా సముద్రం' తో బిజీగా ఉన్నాడు. తాజాగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో 'ఆడాల్లు మీకు జోహార్లు' అనే సినిమా కోసం సంతకం చేశాడు.

తాజా నివేదికల ప్రకారం, వచ్చే ఏడాది మరో కొత్త సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడితో పనిచేసేందుకు రెడీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా విన్నాడని సమాచారం. దానికి ఆమోదం కూడా తెలిపాడంట. ఈ చిత్రంలో శర్వానంద్ శక్తివంతమైన పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి, దీనిపై ఎలాంటి అధకారిక సమాచారం లేదు.

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న 'మహా సముద్రం' సినిమాను శర్వానంద్ వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 13 న విడుదల కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story