Sreekaram Trailer: శర్వానంద్ 'శ్రీకారం' వచ్చేసింది‌

Sharwanand Sreekaram Trailer Released
x

శ్రీకారం ట్రైలర్

Highlights

Sreekaram Trailer: శర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటించిన సినిమా ‘శ్రీకారం’.

Sreekaram Trailer: యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా 'శ్రీకారం'. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాకు కిశోర్‌ దర్శకత్వం వహించాడు. తాజాగా శుక్రవారం నాడు యువ హీరోలు నితిన్‌, నాని, వరుణ్‌ తేజ్‌ శ్రీకారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పలికే రిలీజైన పోస్టర్ లో రైతు పాత్రలో శర్వానంద్‌ ఆకట్టుకోగా... హీరోయిన్ ప్రియాంక గ్లామర్ కనువిందు చేస్తోంది.

ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే శర్వానంద్ విలేజ్ కు వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే 'శ్రీకారం' సినమా చూడాల్సిందే. ఈ ట్రైలర్ లో శర్వానంద్‌ వ్యవసాయం గురించి చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం సమకూర్చిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ కాబోతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories