జానకి దేవి గా మారనున్న అక్కినేని కోడలు

విజయ్ సేతుపతి త్రిష ముఖ్య పాత్రలో ఫుల్-లెంగ్త్ ప్రేమకథా చిత్రంగా '96' తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి...
విజయ్ సేతుపతి త్రిష ముఖ్య పాత్రలో ఫుల్-లెంగ్త్ ప్రేమకథా చిత్రంగా '96' తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అయిన ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ సినిమాలో హీరో శర్వానంద్ మరియు స్టార్ బ్యూటీ సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ కు కూడా డైరెక్టర్ గా మారనున్నారు. అంతేకాక తమిళ సినిమాకు సంగీతాన్ని అందించిన గోవింద్ వసంత తెలుగులో కూడా సంగీతాన్ని అందించనున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాకు కొత్త టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత పేరు జానకి దేవి. ఆ పేరు మీదే సినిమా టైటిల్ గా కూడా పెట్టారట. ఈ మధ్యనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు ఫిలించాంబర్లో 'జానకి దేవి' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తవగానే 'జానకి దేవి' కోసం లుక్ టెస్ట్ లో పాల్గొననున్నాడు. మరో వైపు దర్శకుడు ఈ సినిమా స్క్రిప్టును తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని మార్పులు చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో మొదలు కానుంది. ఆగస్టులో సినిమా విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
21 May 2022 9:45 AM GMTRaw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!
21 May 2022 9:30 AM GMTతిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMT