Sharwanand - Remuneration: రేమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న శర్వానంద్

Sharwanand - Remuneration: గత దశాబ్ద కాలంలో చూస్తే శర్వానంద్ ఖాతాలో ఉన్న హిట్ సినిమాలు చాలా తక్కువే...

admin1
Updated on: 9 March 2022 7:30 PM IST
Sharwanand Remuneration is Not Changing due to Flops in Tollywood | Telugu Cinema News
X

Sharwanand - Remuneration: రేమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న శర్వానంద్

Sharwanand - Remuneration: గత దశాబ్ద కాలంలో చూస్తే శర్వానంద్ ఖాతాలో ఉన్న హిట్ సినిమాలు చాలా తక్కువే. శతమానంభవతి, రన్ రాజా రన్, మరియు మహానుభావుడు సినిమా లు మాత్రమే హిట్ అయ్యాయి. మిగతా వాటిలో కొన్ని యావరేజ్ గా నిలిస్తే మరి కొన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ యువహీరో రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ లాగా ప్రవర్తిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సరైన కథలు ఎంచుకోకపోవడంతో శర్వానంద్ తో పాటు ఉన్న యువ హీరోలు అందరూ ముందుకు దూసుకుపోయారు. కానీ శర్వానంద్ మాత్రం రేమ్యూనరేషన్ విషయంలో అక్కడే ఉండిపోయారు. ఇక తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన డేట్లు కావాలంటే నిర్మాతలు కనీసం పది కోట్లు ఇవ్వాలని శర్వానంద్ డిమాండ్ చేస్తున్నారట.

కొంతమంది బడా నిర్మాతలు 5 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామన్నప్పటికీ శర్వానంద్ ఒప్పుకోవటం లేదని తెలుస్తోంది. నిజానికి రవితేజ కూడా ఇలానే చేశారు. వరుసగా అన్నీ సినిమాలు డిజాస్టర్లు అయినప్పుడు కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఆ తరువాత "క్రాక్" సినిమాతో మళ్లీ బ్లాక్బస్టర్ అందుకోవడంతో రవితేజ మార్కెట్ బాగానే పెరిగింది. ఇక శర్వానంద్ ఇకపై ఎంతవరకు హిట్లు అందుకుంటారో చూడాలి.

admin1

admin1

Next Story