Tollywood: డాన్స్ కొరియోగ్రాఫర్ ను డైరెక్టర్ గా మార్చనున్న శర్వానంద్

Tollywood: ఇప్పటికే చాలామంది నృత్యదర్శకులు సినిమా డైరెక్టర్లుగా మారారు...

admin1
Updated on: 26 Feb 2022 2:00 PM IST
Sharwanand Next Movie Under Direction of Dance Choreographer Raju Sundaram Master | Tollywood News
X

Tollywood: డాన్స్ కొరియోగ్రాఫర్ ను డైరెక్టర్ గా మార్చనున్న శర్వానంద్

Tollywood: ఇప్పటికే చాలామంది నృత్యదర్శకులు సినిమా డైరెక్టర్లుగా మారారు. ఒకప్పుడు డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా కూడా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఒక కొరియోగ్రాఫర్ కూడా చాలా కాలంగా ఒక స్టార్ డైరెక్టర్ గా మారాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అందులో ఏ ఒక్కటి ఫలించడం లేదు.

ఆయనే రాజు సుందరం. డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సూపర్ హిట్ పాటలకి కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరం సినిమా డైరెక్టర్ గా మాత్రం మెప్పించలేక పోతున్నారు. తమిళంలో "ఏగం" అనే సినిమాతో దర్శకుడిగా మారారు రాజు సుందరం.

ఆ తర్వాత మళ్ళీ రాజుసుందరం డైరెక్టర్ గా మారింది లేదు. మహేష్ బాబు రాజు సుందరం కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని అప్పట్లో పుకార్లు వినిపించాయి కానీ ఆ సినిమా కూడా మెటీరియలైజ్ అవలేదు. తాజాగా ఇప్పుడు రాజు సుందరం శర్వానంద్ కి ఒక కథ వినిపించారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ కథ బాగా నచ్చడంతో శర్వానంద్ కూడా ఈ సినిమాకి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు శర్వానంద్ హీరోగా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమా మార్చి 5న విడుదలకు సిద్ధం అవుతోంది.

admin1

admin1

Next Story