Anil Ravipudi: శర్వానంద్... అనీల్ రావిపూడి కాంబోలో మూవీ?

Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వానంద్ ఓ మూవీ చేయబోతున్నట్లుగా టాలీవుడ్ టాక్.

Kranthi
Updated on: 8 Jun 2021 1:53 PM IST
Sharwanand Next Movie in Anil Ravipudi Direction
X

అనిల్ రావిపూడి & శర్వానంద్ (ఫైల్ ఇమేజ్)

Anil Ravipudi: శర్వానంద్ విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ, ఫ్యామిలీ ప్రేక్షకులలో కూడా శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉంది. ఇటీవల లాక్ డౌన్ అనంతరం ఎన్నో ఆశలతో వచ్చిన శ్రీకారం కూడా నిరాశపరిచింది. కానీ శర్వానంద్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం శర్వానంద్ మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అజయ్ భూపతి రాజా దర్శకత్వం వహిస్తుండగా.. హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా శర్వానంద్ తదుపరి సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు ఫేమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వా ఓ మూవీ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి శర్వానంద్ కు స్టోరీ వినిపించాడని.. ఆ ప్రాజెక్ట్ కు శర్వా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, శర్వానంద్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

Kranthi

Kranthi

Next Story