Sharwanand: ఇంకో ఫ్లాప్ డైరెక్టర్‌కి శర్వానంద్ ఛాన్స్..

Sharwanand: కొత్త పాత తేడా లేకుండా టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండే హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు.

Arun Chilukuri
Updated on: 22 Nov 2022 9:00 PM IST
Sharwanand Movie With Director Sriram Aditya
X

Sharwanand: ఇంకో ఫ్లాప్ డైరెక్టర్‌కి శర్వానంద్ ఛాన్స్..

Sharwanand: కొత్త పాత తేడా లేకుండా టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండే హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. తన కెరీర్ దెబ్బ తింటున్న సమయంలో కూడా ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంలో శర్వానంద్ తర్వాతే ఎవరైనా. "నేను శైలజ" తర్వాత ఒక హిట్టు కూడా లేని కిషోర్ తిరుమలతో "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా చేశాడు శర్వానంద్. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచింది.

ఆ తర్వాత శ్రీ కార్తిక్ అనే కొత్త డైరెక్టర్ తో "ఓకే ఒక జీవితం" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన శర్వానంద్ మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే శర్వానంద్ ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమాని లైన్లో పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. "రౌడీ ఫెలో" సినిమాతో పర్వాలేదనిపించి ఆ తర్వాత "ఛల్ మోహన్ రంగ" తో ప్లాప్ అందుకున్న కృష్ణచైతన్యతో శర్వా ఇప్పుడు ఒక సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా ఈ షూటింగ్ ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది.

అయితే తాజాగా శర్వా ఇప్పుడు మరొక సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. యువ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ ఒక సినిమా చేయబోతున్నాడన్నని సమాచారం. "భలే మంచి రోజు" వంటి హిట్ సినిమా ఇచ్చిన శ్రీరామ్ తర్వాత వరుసగా శమంతకమణి, దేవదాసు, హీరో వంటి ఫ్లాప్ సినిమాలు అందించాడు. అసలు ఈ సమయంలో శ్రీరామ్ దర్శకత్వంలో ఏదైనా ఒక హీరో సినిమా ఒప్పుకోవటం జరగని పని అనుకుంటున్న సమయంలో శర్వా అతడితో సినిమాను ఓకే చేసి షాక్ ఇచ్చాడు. త్వరలో వీరి కాంబో లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది అని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story