శర్వా కి తప్పని చిక్కులు

శర్వా కి తప్పని చిక్కులు
x
Highlights

కెరీర్ లో 'రన్ రాజా రన్', 'శతమానం భవతి', 'మహానుభావుడు' లాంటి హిట్ సినిమాలు ఉన్నప్పటికీ శర్వానంద్ మార్కెట్ ఇంకా బలపడలేదని చెప్పుకోవాలి. అదీ కాకుండా ఈ...

కెరీర్ లో 'రన్ రాజా రన్', 'శతమానం భవతి', 'మహానుభావుడు' లాంటి హిట్ సినిమాలు ఉన్నప్పటికీ శర్వానంద్ మార్కెట్ ఇంకా బలపడలేదని చెప్పుకోవాలి. అదీ కాకుండా ఈ మధ్యనే శర్వానంద్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటించిన ప్రేమకథాచిత్రం 'పడి పడి లేచే మనసు' భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో, ఆ ఎఫెక్ట్ శర్వా నటించిన తదుపరి సినిమా పై పడుతుంది. ప్రస్తుతం శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

మాఫియా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో శర్వానంద్ ఒక డాన్ పాత్రలో కనిపించనున్నాడు. స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే ఈ సినిమా అనుకున్న రేంజిలో వసూలు చేయలేదని తెలుస్తోంది. నిర్మాతలు డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు బయ్యర్లు సిద్ధంగా లేరు. కాబట్టి బిజినెస్ పరంగా ఈ సినిమాకు చాలా ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. కనీసం ఈ సినిమా అయినా హిట్ అయితే అప్పుడు కానీ శర్వా పరిస్థితి ఒక కొలిక్కి రాదు. ఇక ఈ సినిమా కాకుండా శర్వానంద్ చేతిలో '96' రీమేక్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories