శర్వా సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్

శర్వా సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్
x
Highlights

ఈ మధ్యనే 'పడి పడి లేచే మనసు' సినిమాతో డిజాస్టర్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన ఆశలన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాపైనే...

ఈ మధ్యనే 'పడి పడి లేచే మనసు' సినిమాతో డిజాస్టర్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన ఆశలన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా కచ్చితంగా హిట్ అందుకోవాలని శర్వా ప్లాన్ చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వేసవి కాలం కానుకగా మే 31వ తేదీన విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

అప్పటికీ వేసవిలో విడుదలయ్యే సినిమాల హడావుడి ముగిసిపోతుంది కాబట్టి శర్వానంద్ సినిమాకు మంచి బజ్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. అందుకని వేసవిలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మరియు 'హలో' బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories