రెమ్యూనరేషన్ గురించి వస్తున్న పుకార్లపై రియాక్ట్ అయిన శర్వానంద్

Sharwanand Gave Clarity About Remuneration
x

రెమ్యూనరేషన్ గురించి వస్తున్న పుకార్లపై రియాక్ట్ అయిన శర్వానంద్

Highlights

Sharwanand: రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన శర్వానంద్

Sharwanand: గత కొంతకాలంగా యువ హీరో శర్వానంద్ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు", "మహాసముద్రం", "శ్రీకారం", వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. ఈ సినిమాలలో శర్వానంద్ తన పర్ఫామెన్స్ తో బాగానే ఆకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సినిమాలు అంత హిట్ అవ్వలేదని చెప్పుకోవాలి. అయితే వరుస డిజాస్టర్ల వల్ల శర్వానంద్ మార్కెట్ బాగా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం శర్వానంద్ ఏ మాత్రం తగ్గటం లేదని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ పుకార్లపై రియాక్ట్ అయిన శర్వానంద్ ఈ వార్తల్లో నిజం లేదని తెలిపారు. "నాకు నిజంగా మార్కెట్ అంతగా లేకపోతే నిర్మాతలు నాకు అసలు రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తారు," అని తిరిగి ప్రశ్నించారు శర్వానంద్. అంతే కాకుండా ఏదైనా సినిమా కి ఓకే చెప్తే తన పూర్తి కమిట్మెంట్ ఆ సినిమాకే ఇస్తానని అప్పుడే రెమ్యూనరేషన్ తీసుకుంటానని చెప్పుకొచ్చారు శర్వానంద్. త్వరలోనే "ఒకే ఒక జీవితం" అనే ఒక సై ఫై థ్రిల్లర్ సినిమాలో కనిపించనున్నారు. శ్రీ కార్తిక్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ భాషల్లో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories