Shanmukh Jaswanth: బ్రేకప్ పై స్పందించిన షణ్ముఖ్.. నాకోసం చాలా చేసింది..

Shanmukh Jaswanth: బిగ్ బాస్ కంటెస్టెంట్లు దీప్తి సునయన, షణ్ముఖ్ లు తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 1 Jan 2022 5:30 PM IST
Shanmukh Jaswanth Reaction On Breakup With Deepthi Sunaina
X

Shanmukh Jaswanth: బ్రేకప్ పై స్పందించిన షణ్ముఖ్.. నాకోసం చాలా చేసింది..

Shanmukh Jaswanth: బిగ్ బాస్ కంటెస్టెంట్లు దీప్తి సునయన, షణ్ముఖ్ లు తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ తెల్చేసింది దీప్తి సునయన. తామిద్దరం విడిపోతున్నామంటూ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి. ఈ నేపథ్యంలో తమ బ్రేకప్ పై షణ్ముఖ్ స్పందించాడు.

'ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కుంది. తను ఇప్పటివరకు చాలా ఫేస్‌ చేసింది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా దారులు వేరైనా స్నేహితులుగా కలిసుంటాం. నేను బెటర్‌ పర్సన్‌ అయ్యేందుకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆల్‌ ది బెస్ట్‌ దీపూ'.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story