Bharateeyudu 2: "భారతీయుడు 2" ని మొదలు పెట్టనున్న శంకర్

Bharateeyudu 2: వచ్చే దీపావళి కి "భారతీయుడు 2" అంటున్న శంకర్

admin1
Updated on: 8 Nov 2021 8:01 PM IST
Shankar Starts Bharateeyudu 2 Movie From Next Diwali
X

భారతీయుడు 2 సినిమాను మొదలు పెట్టనున్న శంకర్  (ఫైల్ ఇమేజ్)

Bharateeyudu 2: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ మధ్య జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన "భారతీయుడు" సినిమాకి సీక్వెల్గా "భారతీయుడు 2" సినిమా అనుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా కొంతవరకు జరిగింది. కానీ బడ్జెట్ విషయంలో నిర్మాతలకి మరియు డైరెక్టర్ కి మధ్య గొడవల వల్ల షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా వల్ల కూడా సినిమా షూటింగ్ కి అడ్డంకులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శంకర్ మరొక సినిమా మొదలు పెడదామని ప్రయత్నించగా లైకా వారు శంకర్ మీద కోర్టులో కేసు కూడా వేయగా, శంకర్ కి మద్దతుగా కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ శంకర్ "భారతీయుడు 2" సినిమా షూటింగ్ ని డిసెంబర్ నుంచి మళ్లీ సెట్స్పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. దాదాపు 100 రోజుల పాటు సినిమా షూటింగ్ జరగబోతోంది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

admin1

admin1

Next Story