Shankar: రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న శంకర్

shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా రాజమౌళి దర్శకత్వంలో మార్చిలో థియేటర్లలో విడుదల కానుంది.

admin1
Published on: 17 Feb 2022 2:14 PM IST
Shankar Showers Praise On Ram Charan
X

Shankar: రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న శంకర్

shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా రాజమౌళి దర్శకత్వంలో మార్చిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. తాజాగా ప్రముఖ కోలీవుడ్ నటుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ నటన మరియు ఎక్స్ప్రెషన్స్ చూసి బాగా నచ్చేసిన శంకర్ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యాక సెట్స్ పైన రామ్ చరణ్ ని శంకర్ బాగా పొగిడారట. దిల్ రాజు మరియు శిరీష నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story