Shanaya Katwe: హీరోయిన్ ఘాతుకం.. ప్రియుడి మోజులో పడి సొంత తమ్ముడినే..

Shanaya Katwe: నియాజ్‌ అహ్మద్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరూ తరచూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారట.

Samba Siva Rao
Published on: 23 April 2021 5:04 PM IST
Shanaya Katwe: హీరోయిన్ ఘాతుకం.. ప్రియుడి మోజులో పడి సొంత తమ్ముడినే..
X

Shanaya Katwe: సినిమాల్లో హీరోయిన్..నిజ జీవితంలో హంతకురాలు. ప్రేమ మత్తులో ముగిని కామంతో కళ్లు మూసుకుపోయి.. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో సొంత సౌదరుడినే దారుణంగా హత్య చేసింది ఓ కిరాతకి. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఇదం ప్రేమమ్‌ జీవనమ్‌, ఒందు గంటేయ కథ(ఒక గంట కథ) సినిమాల్లో నటించిన శనయా కాట్వే, సెలబ్రిటీ మేనేజర్‌గా పని చేస్తున్న నియాజ్‌ అహ్మద్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరూ తరచూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారట. వీళ్ల వ్యవహారం నచ్చని శనయా సోదరుడు రాకేష్‌ ఆమెను హెచ్చరించాడు.

నియాజ్‌ అహ్మద్‌‌కు దూరంగా ఉండమని పదే పదే నచ్చజెప్పాడు. దీంతో తమ ప్రేమకు అడ్డొచ్చేలా ఉన్నాడని శనయా, ఆమె ప్రియుడు నియాజ్‌ ఆందోళన చెందారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని శాశ్వతంగా అడ్డు తొలగించాలని భావించింది. అనుకున్నట్లుగానే నియాజ్‌ అహ్మద్‌, అతడి అనుచరులు రాకేష్‌ను దారుణంగా చంపేసి, శవాన్ని కారులో దాచిపెట్టారు. కానీ ఆ కారులో నుంచి దుర్వాసన వస్తే పోలీసులకు దొరికిపోతామని భయపడిపోయారు. దీంతో రాకేష్‌ శవాన్ని తల, మొండెం, కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా కోసి హుబ్బళిలోని తదితర ప్రాంతాల్లో విసిరేశారు.

కానీ, రాకేష్‌ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడు నియాజ్‌ అని ఇట్టే గుర్తించారు. అతడిని అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. ఈ హత్య కేసులో హీరోయిన్‌కు కూడా సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెను కూడా అరెస్ట్‌ చేయడం సంచలనం రేపుతోంది. మరోవైపు హీరోయిన్ శనయా ఈ హత్యతో తనకు సంబంధం లేదని వాపోతుంది. సోదరుడితో వివాదాలు ఉన్న సంగతి నిజమేనని ఈ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని తనను కావాలనే ఇరికిస్తున్నారని ఆరోపిస్తుంది. మొత్తానికి ఈ హత్య కేసును పోలీసులు ఛాలంజింగ్ గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరి కొన్ని రోజులు ఆగితేగాని వాస్తవాలు బయటకురావు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story