నిశబ్దం నుంచి షాలిని పాండే లుక్ విడుద‌ల

shalini pandey
x
shalini pandey
Highlights

తాజాగా చిత్ర యూనిట్ షాలిని పాండే లుక్ విడుద‌ల చేస్తూ సాక్షి పాత్రని పోషిస్తున్న అనుష్కకి ఈమె స్వరం అందిస్తున్నట్టు

తెలుగు వెండితెరపై అనుష్క సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. తాజాగా ఆమె నిశబ్దం అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో అనుష్క ఓ దివ్యాంగురాలిగా సాక్షి అనే పాత్రలో కనిపిస్తుంది.. సస్పెన్స్, థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన అనుష్క ఫస్ట్ లుక్ సినిమాపైన భారీ అంచనాలను పెంచేసింది.

తాజాగా చిత్ర యూనిట్ షాలిని పాండే లుక్ విడుద‌ల చేస్తూ సాక్షి పాత్రని పోషిస్తున్న అనుష్కకి ఈమె స్వరం అందిస్తున్నట్టు పోస్టర్‌లో పేర్కొంది. ఇందులో అంజలి, మాధవన్, నాజర్ నటిస్తున్నారు. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థతో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు పలు భాషలలో విడుదల చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories