Neelima Guna: సమంత పిల్లల్ని కనాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ..

* సమంత ఆగస్టులోనే విడాకులు తీసుకుంది అంటున్న నీలిమ

admin1
Updated on: 9 Oct 2021 2:48 PM IST
Shakuntalam Movie Producer Neelima Guna Shocking Comments about ChaySam Divorce
X

Neelima Guna - Samantha: సమంత తల్లి కావాలనుకుంది అంటున్న నిర్మాత

Neelima Guna - Samantha: అక్కినేని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్న చేదునిజం సమంత చైతన్య ల డివోర్స్. తాము విడిపోతున్నానంటూ నాగచైతన్య మరియు సమంత ప్రకటించిన అప్పటినుంచి వారి విడాకులకు కారణాలు ఇవే బోలెడు పుకార్లు కొట్టుకు వచ్చాయి. తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా వాటిపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కొందరు తాను అబార్షన్ చేయించుకున్నాను అని మరి కొందరు ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నాను అని అంటున్నారు అని, అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు సామ్. విడాకులు తీసుకోవడం అనేది చాలా బాధ కలిగిస్తుందని ఇలాంటి పుకార్లతో ఆమెను మరింత కృంగతీయద్దు అన్నారు.

ఇదిలా ఉండగా చై సామ్ విడాకులపై "శాకుంతలం" సినిమా నిర్మాత నీలిమ గుణ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుంది కానీ ఆగస్టులో ఏదో జరిగి విడాకులు తీసుకుంటున్నారని ఆమె అన్నారు. "శాకుంతలం సినిమా కోసం మా నాన్న (దర్శకుడు గుణశేఖర్) సమంత ని సంప్రదించారు. అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నానని అందుకే సినిమా చేయనని చెప్పారు. కానీ కథ నచ్చడంతో ఓకే చెప్పారు ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఆమె కోరారు. మేము కూడా షూటింగ్ అలానే ప్లాన్ చేసాము. సమంతా సినిమాలకి విరామం ఇచ్చి పిల్లల్ని కనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు," అని అన్నారు నీలిమ గుణ.

admin1

admin1

Next Story