Parannageevi Teaser Release: పరాన్నజీవి టీజర్ వచ్చేసింది.. వర్మ పై పేలిన పంచులు!

Parannageevi Teaser Release: తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరిట ఓ సినిమా చేస్తుండడంతో రివెంజ్ గా వర్మ పైన

Krishna
Published on: 23 July 2020 9:24 PM IST
Parannageevi Teaser Release: పరాన్నజీవి టీజర్ వచ్చేసింది.. వర్మ పై పేలిన పంచులు!
X
Paranageevi Teaser

Parannageevi Teaser Release: తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరిట ఓ సినిమా చేస్తుండడంతో రివెంజ్ గా వర్మ పైన పవన్ కళ్యాణ్ అభిమానులు 'పరాన్నజీవి' అనే సినిమాని చేస్తున్న సంగతి తెల్లిసిందే.. జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ ఈ సినిమాలో మెయిన్ రోల్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్, కొన్ని పోస్టర్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమాకి సంబంధించిన టీజర్ ని బయటకు వదిలారు మేకర్స్..

నిమిషం పది సెకండ్లు ఉన్న ఈ టీజర్ బాగానే ఆకట్టుకుంటుంది. టీజర్ లో రామ్ గోపాల్ వర్మలా షకలక శంకర్ మ్యానరిజం అదిరిపోయిందని చెప్పాలి. అచ్చుగుద్దినట్టుగా వర్మని దింపేశాడు షకలక శంకర్.. ఇక టీజర్ లో డైలాగులు కూడా బాగానే పేలాయి. ''వాడుకోవడం నాకు వోడ్కాతో పెట్టిన విద్య. ''లక్ష్మీ బాంబ్‌తో బాబు గారినే బదనాం చేశాను. శివంగి శ్రీరెడ్డిని సినిమా స్టార్లపై శివాలెత్తేలా చేశాను. కత్తి మహేష్‌ను కత్తి దూసేలా చేశాను. స్క్రిప్ట్ నాది.. స్క్రీన్‌ప్లే నాది. ఫైటింగ్ వాళ్లది చీటింగ్ నాది. వాడుకోవడంలో వావి వరసలు లేవు. వోడ్కా నా పెగ్గులోకి రావాలి.. ఫిగరు నా పక్కలోకి రావాలి" అనే డైలాగ్స్ తో టీజర్ ఉంది.

99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాని తెరకెక్కుతుండగా , డాక్టర్ నూతన్ నాయుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పవర్ స్టార్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తుంటే, వర్మ పై పవన్ ఫాన్స్ ఓ సినిమా తీస్తుండడంతో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈనెల 25న 'పరాన్నజీవి' సినిమాని విడుదల చేయనున్నారు.


Krishna

Krishna

Next Story