'కార్పొరేటర్'‌ పై కన్నేసిన షకలక శంకర్!

కార్పొరేటర్‌ పై కన్నేసిన  షకలక శంకర్!
x
Highlights

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గ్రేటర్ ఎన్నికల హడావిడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిచ్యువేషన్ క్యాచ్ చేస్తూ తన కొత్త సినిమా పేరు 'కార్పొరేటర్' గా అనౌన్సు చేశాడు శంకర్. టైటిల్ చూస్తుంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ నేపధ్యంలో ఈ మూవీ రూపొందుతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గ్రేటర్ ఎన్నికల హడావిడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిచ్యువేషన్ క్యాచ్ చేస్తూ తన కొత్త సినిమా పేరు 'కార్పొరేటర్' గా అనౌన్సు చేశాడు శంకర్. టైటిల్ చూస్తుంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ నేపధ్యంలో ఈ మూవీ రూపొందుతోందని తెలుస్తోంది. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. దాదాపుగా రెండు పాటలు తప్ప సినిమా అంతా ఫినిష్ అయిపొయింది.

ఇక ఈ సినిమా ద్వారా సంజయ్ పూనూరి దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా మొత్తం కామెడీ ప్రధానంగా జరుగుతున్నప్పటికీ అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుందని మేకర్స్ అంటున్నారు.

ఇక ఈ సినిమాలో షకలక శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎం.ఎల్.పి.రాజా సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories