AHA OTT: ఓటీటీ లవర్స్ కోసం సిద్దమైన కన్నడ బ్లాక్ బస్టర్.. ఆహాలో స్ట్రీమింగ్..

మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఆదరించే వారికి ఈ శాకాహారి చిత్రం మంచి విందు భోజనం అవుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Aug 2024 6:51 PM IST
Shakahari Movie OTT Release From August 24th in AHA
X

OTT: ఓటీటీ లవర్స్ కోసం సిద్దమైన కన్నడ బ్లాక్ బస్టర్.. ఆహాలో స్ట్రీమింగ్..

Shakhahaari OTT: హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మాత బాలు చరణ్ కన్నడ లో బ్లాక్ బస్టర్ అయినా శాకాహారి చిత్ర తెలుగు అనువాద హక్కులను మంచి రేట్ కి సంపాదించుకున్నారు. తెలుగు నేటివిటీ కి దగ్గరగా ఉండాలని డబ్బింగ్ మీద మంచి శ్రద్ధ పెట్టారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన గొప్పరాజు రమణ గారు హీరో క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ఆహా వేదికగా ఈనెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోచించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ. గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే .. హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మయూరి అంబేకల్లు అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు అక్కడి జనాలు ఫిదా అయ్యారు. ఆద్యంతం ఆసక్తికరమైన సీన్లు, బుర్ర తిరిగిపోయే ట్విస్టులు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. కేవలం కోటి రూపాయలతో తెరకెక్కిన శాకాహారి మూవీ కోట్లాది రూపాయల వసూళ్లను సాధించింది.

మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఆదరించే వారికి ఈ శాకాహారి చిత్రం మంచి విందు భోజనం అవుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్ అంశాలతో చిత్రీకరించారు దర్శకులు. ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. హనుమాన్ ప్రొడక్షన్స్ నిర్మాత బాలు చరణ్ మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. తెలుగు ప్రేక్షకులకి మంచి చిత్రాలు అందిస్తున్నారు. వారి బ్యానర్ లో అందించిన ఎన్నో గొప్ప సినిమాలో ఈ శాకాహారి చిత్రం ఒకటి. మరి శాఖహారి తెలుగు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story