ఓన్లీ మాస్.. నో ఎమోషనల్ డ్రామాస్.. 300 కోట్ల రెమ్యునరేషన్ తో పరేషాన్ చేస్తున్న కింగ్ ఖాన్

Shahrukh Khan Jawan, Dunki Movie Latest Updates
x

ఓన్లీ మాస్.. నో ఎమోషనల్ డ్రామాస్.. 300 కోట్ల రెమ్యునరేషన్ తో పరేషాన్ చేస్తున్న కింగ్ ఖాన్

Highlights

Shahrukh Khan: పటాన్ మూవీతో వెయ్యి కోట్ల రికార్డు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్, ఆ తర్వాత కూడా అలాంటి ఫార్ములానే వాడబోతున్నాడు.

Shahrukh Khan: పటాన్ మూవీతో వెయ్యి కోట్ల రికార్డు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్, ఆ తర్వాత కూడా అలాంటి ఫార్ములానే వాడబోతున్నాడు. ఇక ఎక్స్ పరిమెంటల్ ఎమోషనల్ డ్రామాలు వద్దు. రొటీన్ మాస్ ఫార్ములానే ముద్దంటున్నాడు. పటాన్ తర్వాత జవాన్ తో సెప్టెంబర్ 7న దండెత్త బోతున్న షారుఖ్, వరుసగా మాస్ మూవీలకే సై అంటున్నారు. ఒక వైపు జవాన్ చేస్తూనే మరో వైపు టైగర్ వర్సెస్ జవాన్ అంటున్నాడు. ఇలా మల్టీ స్టారర్ లేదంటే, మల్టీ యాక్షన్ డ్రామాలతో బిజీ అవుతున్నాడు.

ఇక షారుఖ్ డంకీ విషయానికొస్తే ఇది త్రీ ఇడియడ్స్, పీకే డైరెక్టర్ తీస్తుండటంతో, ఎక్స్ పరిమెంట్ అనుకున్నారు. కాని ఇదో అండర్ డాగ్ లాంటి పాత్రతో డిజైన్ చేసిన ఓ స్పై కథ అని తెలుస్తోంది. అలా చూస్తే ప్రయోగాలు పక్కన పెట్టి మాస్ కి నచ్చే భారీ స్కేల్ మూవీలకే షారుఖ్ సై అన్నట్టు కనిపిస్తోంది. హీరానీ తీసే డంకీ డిసెంబర్ లో వస్తుంటే, టైగర్ వర్సెస్ పటాన్ వచ్చే ఈద్ కి ప్లాన్ చేశారట. ఇలా చూస్తే సెప్టెంబర్, డిసెంబర్, ఏప్రిల్ అంటూ ప్రతీ మూడు నాలుగు నెల్లకో మాస్ మూవీతో షారుఖ్ దండెత్తడం కన్ఫామ్ అయ్యింది.

ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న షారుఖ్, ఆగ్యాప్ వల్ల ఫేస్ చేసిన లాస్ ని, రెండు మూడేళ్లలోనే రాబట్టే పనిలో పడ్డాడు. పఠాన్ ప్రాపిట్స్ లో షేర్ తో 300 కోట్లు దక్కించుకున్న తను, డంకీ, టైగర్ వర్సెస్ పటాన్ కి కూడా 300 కోట్లు తీసుకుంటున్నాడట. ఐతే రెమ్యునరేషన్ తో పాటు రైట్స్ వల్ల అంత అమౌంట్ దక్కుతోంది. కాని తన రెమ్యునరేషన్ పూర్తిగా 300 కోట్లు అనుకోలేమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories