Shah Rukh Khan: నాన్నా భోజనం బాలేదు.. జైల్లో షారుక్‌ భావోద్వేగం..

Shah Rukh Khan Meets son Aryan Khan in Arthur Road Jail
x

Shah Rukh Khan: నాన్నా భోజనం బాలేదు.. జైల్లో షారుక్‌ భావోద్వేగం..

Highlights

Shah Rukh Khan: డ్రగ్స్ కేసులో అరెస్టయి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కలిశాడు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్.

Shah Rukh Khan: డ్రగ్స్ కేసులో అరెస్టయి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కలిశాడు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్. తనయుడితో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులిద్దరూ భావోద్వేగానికి గురైనట్లు జైలు సిబ్బంది వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో షారుక్‌ ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వచ్చారు. ఆయన ఆధార్‌ కార్డు ఇతర పత్రాలను పరిశీలించిన అనంతరం అధికారులు ఒక టోకెన్‌ ఇచ్చారు. ఆ టోకెన్‌ తీసుకుని షారుక్‌ జనరల్‌ సెల్‌కు వెళ్లి ఆర్యన్‌ను కలిశాడు. వీరి మధ్య గ్రిల్‌, గాజు గోడ అడ్డుగా ఉంది. ఇంటర్‌కామ్‌ ద్వారా వీరిద్దరూ మాట్లాడుకున్నారు. వీరు మాట్లాడుకునే సమయంలో ఇద్దరు గార్డులు కూడా అక్కడ ఉన్నారు.

ఈ నెల 2న ఆర్యన్ అరెస్ట్ తర్వాత షారుక్ అతన్ని కలవడం ఇదే తొలిసారి. ఆర్యన్‌ సరిగా తింటున్నావా? అని షారుక్‌ అడగ్గా.. జైలు భోజనం బాగోలేదని అతడు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆర్యన్‌ కోసం ఇంటి భోజనం పంపించొచ్చా? అని షారుక్‌ జైలు అధికారులను అడిగారట. అయితే, ఇందుకోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. గత వారం షారుక్ తో పాటు అతని భార్య గౌరీ ఖాన్ జైల్లో ఉన్న ఆర్యన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఇప్పటికే ఈ కేసులో ప్రత్యేక కోర్టు రెండు సార్లు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో కుమారుడిని చూసేందుకు షారుక్ జైలుకు వచ్చారు. మరోవైపు కేసు విచారణలో భాగంగా షారుక్ మేనేజర్, న్యాయవాదులు ఆర్యన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టు పలుమార్లు బెయిల్ నిరాకరించడంతో ఆర్యన్ బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories