బాలీవుడ్‌లో కరోనా కలకలం.. కత్రీనా కైఫ్, షారూక్‌ ఖాన్ లకు పాజిటివ్..

Shah Rukh Khan, Katrina Kaif Test Positive for Coronavirus
x

బాలీవుడ్‌లో కరోనా కలకలం.. కత్రీనా కైఫ్, షారూక్‌ ఖాన్ లకు పాజిటివ్..

Highlights

Bollywood: ఇన్నాళ్లు శాంతించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.

Bollywood: ఇన్నాళ్లు శాంతించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్‌ బారినపడగా తాజాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో పాటు ప్రముఖ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ సైతం వైరస్‌ బారినపడ్డారు. అలాగే ఆదిత్య రాయ్‌ కపూర్‌, కార్తీక్‌ ఆర్యన్‌తో పాటు పలువురు నటులకు వైరస్‌ సోకింది. దీంతో బాలీవుడ్‌లో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. కత్రినా కైఫ్‌కు జూన్‌ 1న, కార్తీక్‌ ఆర్యన్‌కు జూన్‌ 4న కరోనా పాజిటివ్‌గా వచ్చిందని BMC అసిస్టెంట్‌ కమిషనర్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తెలిపారు.

దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 4 వేల 270 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే 15 మంది చనిపోయారు. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. కేరళలో ఒక్కరోజే ఒక వెయ్యి 544 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జన సమూహంలోకి వెళ్లినపుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories