Drugs Case: ఆర్యన్ డ్రగ్స్ కేస్... షారుఖ్ చాట్ లీక్..

Shah Rukh Khan ‘Begs’ Sameer Wankhede to Release Aryan in Released Chats
x

Drugs Case: ఆర్యన్ డ్రగ్స్ కేస్... షారుఖ్ చాట్ లీక్

Highlights

*బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడే తాజాగా షారుఖ్ వాట్సాప్ చాట్ ని లీక్ చేశారు. ఈ చాట్ లో షారుఖ్ తన కొడుకు గురించి ఏమంటున్నాడంటే..

Drugs Case: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడే తాజాగా షారుఖ్ వాట్సాప్ చాట్ ని లీక్ చేశారు. ఈ చాట్ లో షారుఖ్ తన కొడుకు గురించి ఏమంటున్నాడంటే.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ న్యూస్ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా..తాజాగా ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన మాజీ యాంటీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడే అవినీతిని పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణ జరిపింది. సీబీఐ తన ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ ని రెడీ చేసింది. ఈ రిపోర్ట్ లో షారుఖ్ ఖాన్ నుంచి రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారని లేదంటే ఆర్యన్ ను డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించినట్లు సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో షారుఖ్ వాట్సాప్ చాట్ ను లీక్ చేసి సమీర్ వాంఖడే సంచలనం రేపారు.

తాజాగా ఆర్యన్ ఖాన్ ను కాపాడేందుకు షారుఖ్ చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది. మాజీ యాంట్రీ డ్రగ్స్ అధికారి కేసు నుంచి తప్పించేందుకు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా సమీర్ వాంఖడే..షారుఖ్ వాట్సాప్ చాట్ ను బయటపెట్టారు. ఈ చాట్ లో తన కొడుకును జైలులో పెట్టొదని..ఆర్యన్ ను అరెస్ట్ చేయడానికి అతడు నేరస్థుడు కాదని..జైలులో వేస్తే అతని మానసిక స్థైర్యం దెబ్బతింటుందని షారుఖ్ చాట్ చేసినట్లు ఉంది. అంతేకాదు, ఆర్యన్ విషయంలో దూకుడుగా వెళ్లకండి మీకు అండగా ఉంటా..సహకరిస్తా..తన కొడుకు తనకు నచ్చినట్లుగా ఉంటాడని షారుఖ్ ఖాన్ వాట్సాప్ చాట్ చేసినట్లు ఉంది. ప్రస్తుతం ఈ చాట్ సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే, ఎన్ సీబీ అధికారులతో జరిపిన వాట్సాప్ చాట్ ను సమీర్ ఇప్పటికే రివీల్ చేశారు. ఈ చాట్ లో డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ కస్టడీ కోసం గట్టిగా ప్రయత్నించాలని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ ఎన్ సీబీ అధికారి ఒత్తిడి చేసినట్లుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories