Pathaan: షా రుఖ్ ఖాన్ దెబ్బకి రెండు సినిమాలు విడుదల వాయిదా..

* మరొకసారి వాయిదా పడ్డ సమంత సినిమా

Dhatripriya
Updated on: 2 Feb 2023 9:31 PM IST
Shaakuntalam Movie Was Postponed
X

"శాకుంతలం" సినిమాని దర్శకనిర్మాతలు ఎందుకు వాయిదా వేస్తున్నారు అంటే..

Shaakuntalam: స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న "శాకుంతలం" సినిమా ఈనెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సార్ సినిమా కూడా అదే రోజున ఆ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ధనుష్ సినిమాతో క్లాష్ దర్శక నిర్మాతలు అవాయిడ్ చేయాలని అనుకున్నారట. అందుకే తమ "శాకుంతలం" సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు షారుఖ్ ఖాన్ మరియు దీపిక పడుకొని హీరో హీరోయిన్లుగా నటించిన పటాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ అందుకుంటోంది. యాక్షన్ త్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తుంది. మరోవైపు బాలీవుడ్ లో యువ హీరో కార్తీక్ ఆర్ హీరోగా నటించిన "షెహ జాదా" (తెలుగులో సూపర్ హిట్ అయిన అల వైకుంఠపురంలో సినిమాకి హిందీ రీమేక్) ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కావాల్సింది కానీ దర్శక నిర్మాతలు ఈ సినిమాని ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో "శాకుంతలం"సినిమాకి ఫిబ్రవరి 17న భారీ రిలీజ్ అయితే లభించదు. అందుకే బాగా ఆలోచించిన "శాకుంతలం"నిర్మాతలు తమ సినిమాని వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story