Shaakuntalam Movie: పాత సినిమాలను గుర్తుకు తెస్తున్న సమంతా సినిమా

Shaakuntalam Movie: ఎన్టీఆర్ సినిమా ని తలపిస్తున్న శాకుంతలం

admin1
Updated on: 24 Feb 2022 12:00 PM IST
Shaakuntalam Movie is Reminiscent of Old Movies | Telugu Movie News
X

పాత సినిమాలను గుర్తుకు తెస్తున్న సమంతా సినిమా

Shaakuntalam Movie: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "శాకుంతలం". ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పురాణాల లోని శకుంతల మరియు దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగా శకుంతల అనగానే అందరికీ గుర్తొచ్చేది లెజెండరీ నటుడు ఎన్టీఆర్ మరియు సరోజా దేవీలు నటించిన శకుంతల సినిమా. 1966లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మరోవైపు 1941లో శాంతారామ్ కూడా ఈ కథ మీద ఒక సినిమా చేయగా, అందులో జయశ్రీ శకుంతల పాత్రలో కనిపించారు.

శకుంతల మరియు దుష్యంతుడ ప్రేమ కథ లో ఉండే డెప్త్ ఈ రెండు సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ లోనే ఒక ట్రెండ్ ని సృష్టించాయి. మరి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎంతవరకు ఈ రెండు సినిమాల అభిమానులకు నచ్చుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. పైగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయి. తాజా సమాచారం అయితే సినిమా హిట్ అవ్వాలంటే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా కథ మరియు స్క్రీన్ ప్లే కూడా అంతే కీలకం. మరి "శాకుంతలం" ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

admin1

admin1

Next Story