"భీమ్లా నాయక్" వల్ల హైలెట్ అవ్వని సమంత

Shaakuntalam: ఈ మధ్యకాలంలో స్టార్ బ్యూటీ సమంత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 22 Feb 2022 8:47 PM IST
Shaakuntalam First Look not Highlighted by Bheemla Nayak
X

పోస్టర్ తో ఇంప్రెస్ చేయలేకపోయిన స్టార్ బ్యూటీ

Shaakuntalam: ఈ మధ్యకాలంలో స్టార్ బ్యూటీ సమంత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా "పుష్ప" లో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అనే ఐటెం సాంగ్ లో బన్నీతో కలిసి స్టెప్పులేసిన ఈ భామ ఇప్పుడు "శాకుంతలం" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పురాణాల్లోని శకుంతల మరియు దుష్యంతుడి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సమంత శకుంతల పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. తెల్లని దుస్తులలో ఒక అటవీ ప్రాంతంలో సమంత పోస్టర్లో చాలా అందంగా కనిపిస్తోంది.

పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ దీని గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భీమ్లా నాయక్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ చనిపోవడం వల్ల వాయిదా వేయటం. ఈ ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీంతో సమంత అందమైన పోస్టర్ ని గురించి పెద్దగా ఎవరూ మాట్లాడటం లేదు. కొందరు మాత్రం సమంత దివి నుంచి దిగి వచ్చిన దేవతలా ఉంది అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం సమంత శకుంతల పాత్రలో ఏమాత్రం బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story