Shaakuntalam vs Rudrudu: సమంతకు గట్టి షాక్ ఇచ్చిన లారెన్స్..!

సమంత సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు అందుకున్న డబ్బింగ్ సినిమా

Arun Chilukuri
Published on: 15 April 2023 12:52 PM IST
Shaakuntalam Collections vs Rudrudu Collections
X

Shaakuntalam vs Rudrudu: సమంతకు గట్టి షాక్ ఇచ్చిన లారెన్స్..!

Shaakuntalam vs Rudrudu: స్టార్ బ్యూటీ సమంత "శాకుంతలం" సినిమా నిన్న అనగా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచి ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు నిన్న రాఘవ లారెన్స్ హీరోగా నటించిన "రుద్రుడు" సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటించిన "శాకుంతలం" సినిమా కంటే రాఘవ లారెన్స్ నటించిన "రుద్రుడు" సినిమాకి మొదటి రోజున ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కి గురి చేసింది.

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం భారీ బడ్జెట్ సినిమా. కానీ ఈ సినిమా కంటే రుద్రుడు వంటి తమిళ్ డబ్బింగ్ సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. విడుదలకి ముందు వరకు చిత్ర బృందం ఎన్ని రకాలుగా సినిమాని ప్రమోట్ చేయాలని చూసినప్పటికీ ప్రేక్షకులలో సినిమాపై అంత క్రేజ్ పెరగలేదు. ఇది కూడా సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లు తక్కువగా రావడానికి ముఖ్య కారణం.

ఇక మరోవైపు మైథాలజికల్ డ్రామాగా విడుదలైన శాకుంతలం మొదటి రోజు టాక్ బాగుండి ఉంటే కలెక్షన్లు పెరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమా ఫస్ట్ డే నుంచి నెగటివ్ రెస్పాన్స్ ని మాత్రమే అందుకుంటుంది. ఇలాంటి హై టెక్నికాలిటీస్ ఉన్న సినిమాని గుణశేఖర్ హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన "రుద్రుడు" సినిమా తమిళ్ లోనే కాక ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story