అరుదైన అవార్డును అందుకున్న‌ సీరియల్ నటి..

అరుదైన అవార్డును అందుకున్న‌ సీరియల్ నటి..
x
Highlights

ఆహ్వానం, నాపేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది నటీ నవ్య సామి.

ఆహ్వానం, నాపేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది నటీ నవ్య సామి. ఆమె నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నవ్యస్వామి సీరియల్ వస్తే విస్ అవ్వకుండా చూస్తారు. అయితే ఇప్పుడు నవ్యను అదుదైన అవార్డు వరించింది. ఈ కన్నడ బ్యూటీ 2020 ఏడాదికి గాను బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎన్నికైంది. ఈ అవార్డును ఇటీవ‌ల తీసుకున్న న‌వ్య‌ ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా నవ్య తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అవార్డు తనకు వచ్చినందుకు సంతోషంగా ఉందని, మీ అంద‌రి ప్రేమ‌, మ‌ద్ద‌తు లేకుండా ఈ అవార్డు వ‌చ్చేది కాదు. అంద‌రికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అని చెబితే నిజంగా స‌రిపోదు అని న‌వ్య కామెంట్ పెట్టారు. నవ్య అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్ పెట్టారు. త‌న స‌హ‌న‌టుడు ర‌వికృష్ణ సైతం న‌వ్య‌కు కంగ్రాట్స్ అని చెప్పాడు.

కాగా న‌వ్య తంగ‌లి అనే క‌న్న‌డ సీరియ‌ల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. అందులో ఆమెకు మంచి గుర్తింపు రావ‌డంతో.. అవ‌కాశాలు కూడా వ‌రుస‌గా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తెలుగు, త‌మిళ్‌లోనూ బీజీగా గడుపుతున్నారు. తెలుగు సిరీయల్స్ లో తెలిగింటి అమ్మాయిలా గుర్తింపును తెచ్చుకున్నారు. న‌వ్య వ‌దిన ఐశ్వ‌ర్య కూడా న‌టి అన్న విష‌యం తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories