పరిటాల రవికి ఫోన్..చెప్పులతో సన్మానం..అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన‌ డా.బాబు

Serial Actor Nirupam Special Reveals the truth in Alitho Saradaga Interview
x

నటుడు నీరూపం 

Highlights

Nirupam: త‌నకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. చంద్రముఖి అనే సీరియల్లో లీడ్ రోల్ సంపాదించాడు.

Nirupam: డాక్టర్ బాబు తెలుగు బుల్లితెరపై పరిచ‌యం అక్కరలేని పేరు . ఓ ప్ర‌ముఖ చాన‌ల్ లో ప్ర‌సారం అయ్యే సీరియ‌ల్ కార్తీక దీపం లో ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లకు తెలియ‌నిదేమి కాదు. డాక్ట‌ర్ బాబు అస‌లు పేరు నిరుప‌మ్ ప‌రిటాల‌. తాజాగా ఆయన తన భార్య మంజులతో కలిసి ఆలీతో సరదాగా షో లో పాల్గొన్నారు. ఈ షోలో పాల్గొన్న నిరుపమ్ కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ ప్రోమో మాత్రమే రిలీజ్ కాగా మే 17న పూర్తి ఎపిసోడ్ రిలీజ్ కాబోతోంది.

దివంగ‌త‌ ర‌చ‌యిత‌, న‌టుడు ఓంకార్ పరిటాల వారసుడిగా సీరియ‌ల్స్ లోకి అడుగుపట్టినా.. త‌నకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. చంద్రముఖి అనే సీరియల్లో లీడ్ రోల్ సంపాదించాడు. అదే సీరియల్ లీడ్ రోల్ చంద్ర‌ముఖిగా చేస్తున్న మంజులతో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ వివాహం దాకా దారితీసింది. వీరిద్ద‌రూ క‌లిసి ఆలీతో సరదాగా షోలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా తొలిసారి నిరుపమ్ ను చూసినప్పుడు మంజుల ఫీలింగ్ ఏమిటి అని అలీ ప్రశ్నించారు. నిరుపమ్ ఆసక్తికరంగా స్పందించాడు. అప్పుడు చెన్నై నుంచి గుండుతో వచ్చానని, ఏరికోరి గుండుతో ఉన్న వాడిని ఎందుకు తీసుకు వచ్చారని మంజుల ఫీల్ అయి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక మంజుల మాట్లాడుతూ ఆ సీరియల్ మొదటిది అనే సంగతి తనకు తెలియదని, తనకు అంటే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకొచ్చింది. అయితే అదే తనకు ప్లస్ అయిందని బహుశా మొదటిసారిగా సీరియల్ చేస్తున్నాను అని తెలిస్తే సీనియారిటీ చూపించి ఉండేదేమో అని నిరుపమ్ సరదాగా అన్నారు.

ఇక అష్టా చమ్మ సినిమాలో హీరోగా అవకాశం తప్పిపోయిన అంశాన్ని కూడా ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. రేపు ఆడిషన్ ఉంటుందని చెబుతూ ఒక సీన్ కూడా తనకు రాసి ఇచ్చారని ఆడిషన్స్ జరగాల్సి ఉండగా ముందు రోజు సాయంత్రం సీరియల్ లో తనను చూసి ఆ సినిమాలో వద్దు అని చెప్పేశారని చెప్పుకొచ్చాడు. సీరియల్ లో చేస్తున్నారు కదా అవి చేసుకోమని అన్నారని నిరుపమ్ ఎమోషనల్ అయ్యాడు.

బెదిరింపు కాల్స్

ఇక ఒక సీరియల్ లో నటిస్తున్న స‌మ‌యంలో తను చేస్తున్న పాత్రకు బాగా కనెక్ట్ అయిపోయిన కొందరు తనకు అనేకసార్లు ఫోన్లు చేసి భయపెట్టే వారిని నిరుపమ్ చెప్పుకొచ్చాడు. సీరియల్ లో చెప్పుల దండతో సన్మానం చేసి ఊరేగిస్తామని తనను భయపెట్టే వారిని నిరుపమ్ చెప్పుకొచ్చారు.

పరిటాల రవి ఫ్యామిలీతో రిలేష‌న్

ఇక దివంగ‌త రాజ‌కీయనాయ‌కుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి ప్రస్తావన అలీ తీసుకురావడంతో ఆ ఎపిసోడ్ కూడా చెప్పుకొచ్చారు నిరుపమ్. ఇంద్ర రిలీజ్ సమయంలో సినిమా చూసి వ‌స్తుంటే.. ఓ పోలీసు వచ్చి బైక్ కీ తీసుకున్నాడ‌ని, ఆ పోలీసుతో వెళ్లి ఫోన్ చేయమంటావా అని భయపెడితే ఎవరికీ అని అడిగాడు.. పరిటాల రవి గారికి అని చెప్పగానే అప్పటికప్పుడు బైక్ తాళం ఇచ్చేసి తర్వాతి రోజు థియేటర్ టికెట్లు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

ఇక మంజుల సైతం ఒక సంద‌ర్భంంలో ప‌రిటాల ర‌వి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారంట కదా అని ఆలీ అడిగాడు. ఆ విష‌యంపై స్పందించిన మంజుల ఒక రోజు తనకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే స‌మ‌స్య వ‌స్తే.. ఆ సమయంలో నిజంగానే మీ కుటుంబానికి పరిటాల రవి కుటుంబానికి బంధుత్వం ఉందా అని అడిగితే తనకు వెహిక‌ల్ రివర్స్ చేయడం రాకపోవడంతో రిలేషన్ ఉందని చెప్పానని, దీంతో వెంటనే లైసెన్స్ ఇష్యూ చేశారు అని చెప్పుకొచ్చింది.

ప‌రిటాల ర‌వి కుటుంబంలో రిలేష‌న్ పై ప‌లు ఇంట‌ర్య్యూలో చెప్పుకొచ్చారు. ఇంటిపేర్లు ఒక‌టే కావ‌డంతో ప‌రిటాల కుటుంబంలో బంధుత్వం ఉంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ మా పూర్వీకుల‌కు బంధుత్వం ఉండొచ్చు అని నిరుప‌మ్ ప‌లు ఇంట‌ర్య్వూల్లో చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories