అప్పుడే జాతి రత్నాలు 2.. సీక్వెల్ గురించి అప్డేట్ ఇచ్చిన అనుదీప్‌ కేవీ

Sequel To Naveen Pollishetty’s Jathi Ratnalu To Start Early
x

జాతి రత్నాలు సీక్వెల్ గురించి అప్డేట్ ఇచ్చిన అనుదీప్ కె.వి

Highlights

అప్పుడే జాతి రత్నాలు 2 ఉంటుంది అంటున్న అనుదీప్ కేవి

Anudeep KV: కరోనా తర్వాత అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అని అనుమానాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా "జాతి రత్నాలు". చాలాకాలం తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. ఎలాంటి స్టార్ హీరోలు లేకపోయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డులు సృష్టించింది.

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఫరీయా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. కొత్త డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2021 మార్చ్ లో విడుదలైన ఈ సినిమా కరోనా తర్వాత బ్లాక్ బస్టర్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వగానే ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతుందని దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుదీప్ కేవి సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. "జాతి రత్నాలు 2" సినిమా ఖచ్చితంగా ఉంటుందని దీనికి సంబంధించి తనకి ఇప్పటికే ఒక ఐడియా కూడా ఉందని అన్నారు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి మాత్రం మూడు నుంచి నాలుగు ఏళ్ళు పట్టవచ్చని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories