7G Brindavan Colony: త్వరలోనే 7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్..

7G Brindavan Colony: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలలో ముందుగా చెప్పేది "7/g బృందావన్ కాలనీ" గురించి.

Arun Chilukuri
Updated on: 30 Jan 2023 9:00 PM IST
Sequel on the Cards for 7G Brindavan Colony
X

7G Brindavan Colony: త్వరలోనే 7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్..

7G Brindavan Colony: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలలో ముందుగా చెప్పేది "7/g బృందావన్ కాలనీ" గురించి. 2004లో విడుదలైన "7/g రెయిన్ బో కాలనీ" అనే టైటిల్ తో తమిళ్ లో విడుదలైన ఈ సినిమా "7/g బృందావన్ కాలనీ" గా తెలుగులో డబ్ అయ్యి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవి కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఒక రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమ కథ ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా విడుదలైన 19 ఏళ్ల తర్వాత చిత్ర బృందం ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సూపర్ హిట్ సినిమా "7/g బృందావన్ కాలనీ" కి త్వరలోనే ఒక సీక్వెల్ సిద్ధమవుతోందని ఇండస్ట్రీ వర్గాల బోగట్ట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

చంద్రమోహన్, సుధా, సుదీప, రతన్, సవిత, మనోరమ, మయూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సినిమా మాత్రమే కాక ఈ సినిమాలోని పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటే ఎలా ఉండబోతోందో అని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా కి సీక్వెల్ గురించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story