సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత
x
Highlights

అలనాటి అందాల నటి గీతాంజలి (62)కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో

అలనాటి అందాల నటి గీతాంజలి (62)కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెకు రాత్రి 11.45 గంటల సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గీతాంజలి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో హీరోయిన్ నటించారు. సహనటుడు రామకృష్ణను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు గీతాంజలి అసలు పేరు మణి. సినిమాల్లోకి వచ్చాక గీతాంజలి గా మార్చుకున్నారు.

కాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆమె సీత పాత్రలో కనిపించారు.. ఆ పాత్ర ఆమెకు ఎంతో గొప్ప పేరును తీసుకువచ్చింది. ఆ సినిమా తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ఆ తరువాత కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్‌ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు వంటి సూపర్ డూపర్ హిట్‌ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలు కూడా ఆమెకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. తరువాతి కాలంలో క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన గీతాంజలి పెళ్ళైన కొత్తలో,మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో అమ్మమ్మ పాత్రల్లో కనిపించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్‌ మహాలక్ష్మిలో నటించారు. గీతాంజలి.. ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories