హిట్ వర్స్ లోకి చేరనున్న సీనియర్ హీరో

* ఈ సినిమా సపరేట్ సినిమానా లేక హిట్ యూనివర్స్ లో ఒక భాగమా అని ఇంకా తెలియాల్సి ఉంది.

R Tripura Malini
Published on: 23 Dec 2022 6:45 AM IST
Senior Hero To Join The Hit Verse
X

హిట్ వర్స్ లోకి చేరనున్న సీనియర్ హీరో

HIT Verse: విశ్వక్ సేన్ హీరోగా నటించిన "హిట్" సినిమాతో దర్శకుడిగా మారిన శైలేష్ కొలను మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అడవి శేష్ హీరోగా నటించిన "హిట్: ది సెకండ్ కేస్" కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ ఫ్రాంచైజ్ లో భాగంగా విడుదల కాబోతున్న మూడవ సినిమా "హిట్ 3" లో నాచురల్ స్టార్ నాని హీరోగా కనిపించబోతున్నారు.

అర్జున్ సర్కార్ అనే పాత్రలో నాని ఈ సినిమా లో కనిపించబోతుండగా విశ్వక్ సేన్ మరియు అడవి శేష్ కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శైలేష్ కొలను ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. అదే వెంకటేష్ కరియర్లో 75వ సినిమా కాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా సపరేట్ సినిమానా లేక హిట్ యూనివర్స్ లో ఒక భాగమా అని ఇంకా తెలియాల్సి ఉంది.

ఒకవేళ వెంకటేష్ కూడా హిట్ వర్స్ లో చేరితే అది కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను విపరీతంగా పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వెంకటేష్ ను "ఘర్షణ" వంటి కాప్ సినిమాలలో అదిరిపోయే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులు చాలా ఇష్టపడ్డారు. హిట్ వంటి క్రైమ్ థ్రిల్లర్ కూడా వెంకటేష్ నటిస్తే ఇంకా బాగుంటుందని అభిమానులు అంటున్నారు. మరి శైలేష్ కొలను వెంకటేష్ ని కూడా హిట్ వర్స్ లోకి లాగేస్తారా లేక ఆయనతో సపరేట్ సినిమా చేస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story