ముగ్గురు హీరోయిన్లు రంగంలోకి దింపిన సీనియర్ హీరో

* ఈసారి ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరో

Dhatripriya
Updated on: 6 March 2023 8:00 AM IST
Senior Hero Is Acting With 3 Heroines
X

ముగ్గురు హీరోయిన్లు రంగంలోకి దింపిన సీనియర్ హీరో

Daggubati Venkatesh: ఈమధ్య సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి 50 60 వచ్చిన హీరోలు యువ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. అలా అని కొత్త హీరోయిన్ల ను పెట్టలేక పాత హీరోయిన్లు సెట్ అవ్వక దర్శక నిర్మాతలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక సీనియర్ హీరో మాత్రం తన సినిమా కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్లను రంగంలోకి దింపుతున్నారు. ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్.

గత కొంతకాలంగా రీమేక్ సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్న వెంకటేష్ చాలావరకు సినిమాలలో ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలోనే కనిపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ "సైంధవ్" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక్క హీరోయిన్ కూడా దొరక్క సీనియర్ హీరోలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఏ ముగ్గురు హీరోయిన్లను వెంకీ రంగంలోకి దింపారని అభిమానుల సైతం షాక్ అవుతున్నారు. పైగా యాక్షన్ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న "సైంధవ్" సినిమాలో ముగ్గురు హీరోయిన్లకి చోటు ఎక్కడుంది అని కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలవడనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story