Bhanu Chander: " పుష్ప" సినిమాపై భాను చందర్ షాకింగ్ కామెంట్స్

Bhanu Chander: " పుష్ప" సినిమాపై భాను చందర్ షాకింగ్ కామెంట్స్

Rama Rao
Updated on: 27 May 2022 5:30 PM IST
Senior Hero Bhanu Chander Comments on Pushpa Movie | Tollywood News
X

Bhanu Chander: " పుష్ప" సినిమాపై భాను చందర్ షాకింగ్ కామెంట్స్ 

Bhanu Chander: సీనియర్ హీరో భానుచందర్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించింది లేదు. గత కొంత కాలంగా సినిమాలకు మరియు సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటున్న భానుచందర్ తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఆయన చూసిన పుష్ప సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు భానుచందర్.

కేవలం సమంత వల్లే పుష్ప"పుష్ప" సినిమా హిట్ అయింది అంటూ భానుచందర్ అనటం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది. సమంత మరియు అల్లు అర్జున్ కలిసి డాన్స్ చేసిన "ఊ అంటావా ఊ ఊ అంటావా" అంటూ కలిసి స్తెప్పులేసిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోనూ ఈ పాట బీభత్సంగా హిట్ అయ్యింది. ఆ ఒక్క పాట కోసమే అభిమానులు థియేటర్ లకు వచ్చారని, ఈ పాట వల్లే సినిమా హిట్ అయ్యింది అని భాను చందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళే చుస్కోవాలని ఎంత సెలబ్రిటీ అయినా వారి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుంది" అని అన్నారు భాను చందర్.

Rama Rao

Rama Rao

Next Story